AP Stamps and Registrations: ఆంధ్రప్రదేశ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సేవలు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఎప్పుడు అందుబాటులో ఉంటాయో, ఎప్పుడు మొరాయిస్తాయో తెలియని పరిస్థితిలో ఆ శాఖ నడుస్తోంది. బుధవారం ఉదయం సరిగ్గా రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యే సమయానికి సర్వర్లు ఆగిపోయాయి. దీంతో క్రయ, విక్రయాలు, ఇతర రిజిస్ట్రేషన్ సేవల కోసం వచ్చిన వారికి ఇబ్బందులు తప్పలేదు. ఐదు పది నిమిషాల్లో సర్వర్లు అందుబాటులోకి వస్తాయని చెప్పినా అవి గంటల తరబడి పనిచేయలేదు. దీంతో లావాదేవీల కోసం వచ్చిన వారు ఎదురు చూడక తప్పలేదు.
Home Andhra Pradesh ఏపీలో మొరాయించిన సర్వర్లు, నిలిచిన రిజిస్ట్రేషన్లు… గంటల తరబడి ఎదురు చూపులు-ap stamps and registration...