అనామికను కొట్టిన సామంత్
కానీ, అలా చేస్తున్నట్లు కల్యాణ్‌కు తెలియకూడదు. లేకుంటే ఒప్పుకోడు అని కావ్య అంటుంది. కర్ర విరగకూడదు పాము చావాలి అంతేగా నేను చూసుకుంటా అని అప్పు వెళ్లిపోతుంది. పాపం ఆ రైటర్ అప్పు చేతిలో ఎలా నలిగిపోతాడో ఏంటో అని కావ్య అనుకుంటుంది. మరోవైపు అనామిక చెంప పగులగొడతాడు సామంత్. ఎందుకు కొట్టావ్ అని అరుస్తుంది అనామిక. కొట్టాల చంపాలా. నువ్ ఏదో తోపులా ప్లాన్ వేస్తున్నావ్ అని గొర్రెలా తల ఊపాను. కానీ, నా ఇంట్లోనే రాజ్ గాడు వచ్చి నా కాలర్ పట్టుకుని కొట్టేలా చేశావ్ అని సామంత్ అంటాడు.