జనవరిలో మొదలైన మహా కుంభమేళా 2025.. ఫిబ్రవర 26తో ముగియాల్సి ఉంది. అయితే, యాత్రికుల తాకిడి విపరీతంగా ఉండటంతో ఈ పవిత్ర కార్యక్రమాన్ని పొడిగించాలని సర్వత్రా విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో, మహా కుంభమేళాని మార్చ్​ వరకు పొడిగించారని వార్తలు సైతం వస్తున్నాయి, విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై యూపీ ప్రయాగ్​రాజ్​ జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్​ మందార్​​ స్పందించారు. మహా కుంభమేళాని మార్చ్​ వరకు పొడిగించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అది ఫేక్​ న్యూస్​ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here