మంచిర్యాల జిల్లాలో పట్టభద్రుల సమ్మేళన కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం 4 గంటలకే విధుల నుంచి వెళ్లిపోవడానికి అనుమతి ఇస్తున్నారని, మరి అయ్యప్ప భక్తులకు అలాంటి ప్రత్యేక అనుమతులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.