గూగుల్ ఆండ్రాయిడ్ తరహాలో జియో టీవీ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టం ఉంది. హై క్వాలిటీ ఆడియో-వీడియో, వాయిస్ సపోర్ట్ వంటి అనేక ఫీచర్లు ఈ ఓఎస్ లో ఉన్నాయి. జియో టీవీ ఓఎస్ మీకు ఏఐ ఆధారిత కంటెంట్ సిఫారసును అందిస్తుంది. దీనితో పాటు కొత్త యాప్స్, సెక్యూరిటీ, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోసినిమా, యూట్యూబ్ తదితర స్ట్రీమింగ్ యాప్స్ జియోటెల్ ఓఎస్‌లో అందుబాటులో ఉంటాయి. అలాగే మీరు క్లౌడ్ గేమింగ్‌ను ఆస్వాదిస్తారు.