సంతోషంగా ఉండాలంటే, మిమ్మల్ని మీరు అడగాల్సిన ప్రశ్నలు:
1. నాకు కావాలనుకున్న దాని గురించి నేనేం చేయాలి?
జీవితంలో మనకు తారసపడే ప్రతి పరిస్థితి నువ్వేం కావాలనుకుంటున్నావ్ అని మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. అది సామాజికంగా కావొచ్చు, పేరెంట్‌గా కావొచ్చు, కల్చరల్‌గా కావొచ్చు. “కెరీర్ మార్చుకోవాలా, పిల్లల్ని కనాలా, రిలేషన్షిప్ ఇక్కడితో ఆపేద్దామా, మీ సొంత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత హోదా కోసం ఇంకా ప్రయత్నించాలా, ఏదైనా నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలా, సెక్స్ లైఫ్ బోర్ కొట్టేంతలా ఎంజాయ్ చేయాలా, తల్లిదండ్రుల దగ్గరే ఉండి లైఫ్ అంతా గడిపేయాలా అనే ఆలోచనల నుంచి బయటపడి క్లారిటీగా తేల్చుకోవాల్సిన సమయం వస్తుంది.