ఉపవాసంలో కూడా రకాలు ఉంటాయి. వీటిల్లో నిర్జల, జల, ద్రవ, పండ్లతో, సాత్వికాహార ఉపవాసం ఉంటాయి. నిర్జల ఉపవాసంలో.. ఆహారం, నీరు తీసుకోరు. అయితే.. ఆరోగ్యం సహకరిస్తేనే నిర్జల ఉపవాసం చేయాలని వైద్యులు చెబుతున్నారు. జల ఉపవాసంలో.. ఆహారం లేకుండా నీరు మాత్రమే తీసుకోవాలి. ద్రవ ఉపవాసంలో.. టీ, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీరు వంటివి తీసుకోవచ్చు. సాత్వికాహార ఉపవాసంలో.. సగ్గు బియ్యం, మఖానా, డ్రై ఫ్రూట్స్, ఉడకబెట్టిన దుంపలు తీసుకోవచ్చు.
(istockphoto)