‘ఛత్రపతి శివాజీ మహారాజ్'(Chhatrapati Shivaji Maharaj)వారసుడు,మరాఠా సామ్రాజ్యన్నిపరిపాలించిన రెండో వీరుడు’ఛత్రపతి శంభాజీ మహారాజ్(Chhatrapati sambhaji maharaj)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘చావా'(Chhaava)ఫిబ్రవరి 14 న వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ మూవీ,ఇప్పుడు రికార్డు కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది.మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటే ‘చావా’ప్రభావాన్నిఅర్ధం చేసుకోవచ్చు.ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు అయితే ‘చావా’కి బ్రహ్మరధం పడుతున్నారు.పలువురు రాజకీయనాయకులు కూడా ‘చావా’ చూసి శంభాజీ మహారాజ్’ గొప్ప పోరాట యోధుడని,మరాఠా ప్రజల కోసం తుది వరకు పోరాడాడని కొనియాడుతున్నారు.
ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘చావా’కి పన్ను మినహాయింపుని ప్రకటించింది.నిన్న ‘ఛత్రపతి శివాజీ’ జన్మదినం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ‘మధ్యప్రదేశ్’ ముఖ్యమంత్రి ‘మోహన్ యాదవ్’ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్నీ తెలియచేసాడు. మధ్యప్రదేశ్ తరహాలోనే ‘గోవా’ ప్రభుత్వం కూడా పన్ను మినహాయింపుని ప్రకటిస్తు ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో ‘శంభాజీ మహారాజ్’ సొంత రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పన్ను మినహాయిపుని ప్రకటించాలని,అక్కడి ప్రజలతో పాటు ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్’ డిమాండ్ చేస్తుంది.
ఇక ‘శంభాజీ మహారాజ్’గా టైటిల్ రోల్ లో ‘విక్కీ కౌశల్'(Vicky Kaushal)అత్యద్భుతంగా నటించాడు.చివరి ఇరవై నిమిషాలు అయితే విక్కీ కౌశల్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రేక్షకుల యొక్క రోమాలు నిక్కబొడుచుకునేలా,వీరోచితమైన నటనని ప్రదర్శించాడు.శంభాజీ మహారాజ్ భార్య ‘యేసుభాయ్’ క్యారక్టర్ లో రష్మిక(Rashmika Mandanna)మరోసారి తన కెరీర్ లో బెస్ట్ పెర్ ఫార్మెన్స్ చేసింది.ఔరంగ జేబు గా అక్షయ్ ఖన్నా(Akshay Khanna)మిగతా క్యారెక్టర్లలో చేసిన అశుతోష్ రానా,ప్రదీప్ రావత్,వినీత్ కుమార్ సింగ్ కూడా తమ పాత్రలు మాత్రమే కనపడేలా నటించడంలోసక్సెస్ అయ్యారు.దినేష్ విజయన్(Dinesh Vijayan)నిర్మించిన ‘చావా’ కి లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్(Lakshman Ramachandra utekar)దర్శకత్వం వహించాడు.