విక్కీకౌశల్(Vicky Kaushal)రష్మిక(Rashmika mandanna)ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం చావా(Chhaava)ఈ నెల 14 న విడుదలైన ఈ మూవీ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు ‘ఛత్రపతి శంభాజీ మహారాజ్’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కగా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతుంది.రీసెంట్ గా మధ్యప్రదేశ్,గోవా రాష్ట్ర ప్రభుత్వాలు ‘చావా’ కి పన్ను మినహాయిపుని కూడా ఇచ్చాయి.
ఇక ఈ మూవీ ఇప్పుడు ఇండియా వైడ్ గా 200 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది. నిన్నఒక్క రోజే ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ జయంతి సందర్భంగా 30 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.దీన్ని బట్టి రోజు రోజుకి ‘చావా’ కి పెరుగుతున్న ఆధారణనని అర్ధం చేసుకోవచ్చు.దీంతో ఈ మూవీ లాంగ్ రన్ లో మరిన్ని భారీ వసూళ్లు చేసే అవకాశం ఉందని,మేకర్స్ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసి ఉంటే మరిన్ని భారీ కలెక్షన్లు వచ్చేవని ట్రేడ్ వర్గాలు వారు అంటున్నారు.
దినేష్ విజయన్(Dinesh vijayan)నిర్మించిన ‘చావా’కి లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్(Lakshman ramachandra utekar)దర్శకత్వం వహించగా అశుతోష్ రానా, ప్రదీప్ రావత్, దివ్య దుత్త, బినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలు పోషించారు.ఛత్రపతి శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ నటనకి ప్రతి ఒక్క ప్రేక్షకుడు జేజేలు పలుకుతున్నాడు.