అటు మహమ్మద్ షమి 5 వికెట్లు.. ఇటు తౌహిద్ హృదోయ్ (100) ఫైటింగ్ సెంచరీ.. ఇలా బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ రసవత్తరంగా సాగింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గురువారం (ఫిబ్రవరి 20) భారత్ తో మ్యాచ్ లో పోరాడిన బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. జేకర్ అలీ (68) హాఫ్ సెంచరీతో మెరిశాడు. హర్షిత్ రాణా మూడు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు.