కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో కూడా తెలియకుండానే చేస్తుంటాం. బ్రెయిన్ ప్రమేయం లేకుండా పనులు చేస్తున్నామేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఉదాహరణకు ఏదో వస్తువు కోసం ఒక గదిలో నుంచి మరొక గదిలోకి వెళుతాం, కానీ వెళ్లగానే ఎందుకు వెళ్లామో మర్చిపోతాం. అలాగే బయటకు వెళ్లేటప్పుడు ముఖ్యమైన వస్తువులైన పర్సు, మొబైల్ ఫోన్ వంటివి మర్చిపోతుంటాం. చిన్న చిన్న పనులు, నిర్ణయాల విషయంలో కూడా ఇతరుల సహాయం తీసుకుంటూ ఉంటాం. ఈ లక్షణాలన్నీ మీకూ ఉన్నాయా? అయితే మీరు బ్రెయిన్ ఫాగ్‌తో ఇబ్బంది పడుతున్నారేమో చెక్ చేసుకోండి.మీకు బ్రెయిన్ ఫాగ్ సమస్యతో ఇబ్బంది పడే వారిలో కనిపించే లక్షణాల గురించి అభాసా మెంటల్ హెల్త్ ఫౌండర్ శ్రీమతీ గాయత్రి అరవింద్ ఇన్ స్టాగ్రామ్‌లో వివరించారు.