ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న మూవీ స్పిరిట్. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. స్పిరిట్ ఎప్పుడు వచ్చినా ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనే అంచనాలున్నాయి. అంతటి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి త్రివిక్రమ్ తనయుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. (Spirit)

 

రచయితగా, దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో త్రివిక్రమ్ కి ఎంతో గొప్ప పేరుంది. ఇప్పుడు త్రివిక్రమ్ అడుగు జాడల్లోనే.. ఆయన కుమారుడు కూడా నడవనున్నాడట. త్రివిక్రమ్ కూడా తనయుడిని ఎంతో ప్రోత్సహిస్తున్నాడట. అంతేకాదు, ఈ తరం దర్శకుల దగ్గర మెళకువలు నేర్చుకోవడానికి పంపిస్తున్నారట. 

 

దీనిలో భాగంగా ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి దగ్గర శిక్షణ పూర్తయిందని తెలుస్తోంది. త్రివిక్రమ్ కి సితార ఎంటర్టైన్మెంట్స్ అనేది హోమ్ బ్యానర్ లాంటిది. ప్రస్తుతం ఆ బ్యానర్ లో కింగ్ డమ్, మ్యాజిక్ సినిమాలు చేస్తున్నాడు గౌతమ్. ఆ సినిమాలకు త్రివిక్రమ్ కుమారుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినట్లు సమాచారం.

 

ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంతు వచ్చిందట. స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి దగ్గర.. త్రివిక్రమ్ తనయుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నాడని వినికిడి.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here