40 రోజుల తర్వాత.. ఐదు భాషల్లో..
డాకు మహరాజ్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు ఆలస్యమైంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లో నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేలా డీల్ చేసుకుందనే వాదనలు వినిపించాయి. కానీ అలా జరగలేదు. ఆలస్యమైంది. దీంతో కారణాలు ఏంటని రకరకాల రూమర్లు వచ్చాయి. అయితే, ఎట్టకేలకు థియేటర్లలో రిలీజైన 40 రోజులకు ఫిబ్రవరి 21న ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు అడుగుపెట్టేస్తోంది. అది కూడా ఐదు భాషల్లో రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డాకు మహరాజ్ స్ట్రీమింగ్కు అందుబాటులో ఉండనుంది.