సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ మెగాస్టార్ చిరంజీవి పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో ఉన్న చిరంజీవి రక్తనిధి కేంద్రంలో ఆయన రెండోవసారి రక్తదానం చేశారు. చిరంజీవి చేసిన ఎన్నో చిత్రాలకు అద్భుతమైన పాటలను అందించిన ఈ మ్యూజిక్ డైరెక్టర్.. మెగా అభిమానుల్లో ఎప్పుడూ ఉత్సాహాన్ని నింపుతుంటారు. ఈ క్రమంలో చిరంజీవి పిలుపును కర్తవ్యంగా భావించి రక్తదానం చేశారు. చిరంజీవి రక్తనిధి కేంద్రంలో తాను ఒక బొట్టుగా చేరడం ఎంతో స్ఫూర్తిగా ఉందన్నారు.