దేశ ఢిల్లీలో బీజేపీ సర్కార్ కొలువుదీరింది. ఢిల్లీ సీఎంగా షాలిమర్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. రేఖాగుప్తాతో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాంలీలా మైదానంలో జరిగిన ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.