Maha Kumbh Mela 2025: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఫలితంగా ప్రయాగరాజ్ ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఆధ్యాత్మిక సందడి ఉట్టిపడుతోంది. అయితే ఆధ్యాత్మిక వేడుక పట్ల కొందరు అభ్యంతరకరంగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది.