Video Song: మనసంతా నువ్వే, నేనున్నాను సినిమాల ఫేమ్ డైరెక్ట‌ర్‌ వి.ఎన్.ఆదిత్య స్వప్నాల నావ పేరుతో ఓ వీడియో సాంగ్‌ను రూపొందించారు. దివంగత సినీ గేయ ర‌చ‌యిత‌ సిరివెన్నెల సీతారామశాస్త్రి దివ్య స్మృతికి అంకితంగా దర్శకుడు వి.ఎన్.ఆదిత్య స్వ‌ప్నాల నావ పాట‌ను తెర‌కెక్కించారు. గోపీకృష్ణ కొటారు ఈ వీడియో సాంగ్‌కు ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. శ్రీజ కొటారు ఈ పాట‌ను పాడ‌ట‌మే కాకుండా ఇందులో న‌టించింది. స్వ‌ప్నాల నావ పాట‌కు పార్థ‌సార‌థి నేమాని మ్యూజిక్ అందించాడు. యశ్వంత్ సాహిత్యం సమకూర్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here