దోసలు ఇష్టపడని వారెవరుంటారు.వాటి క్రేజ్ అలాంటిది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ ఇంట్లో ప్రతి ఒక్కరికీ నచ్చే బ్రేక్ ఫాస్ట్ దోసలు. అందుకే మినప దోసలు, రవ్వ దోసలు, కారం దోసలు అంటూ ఎన్ని వెరైటీలు వచ్చినా ఆదరణ తగ్గడం లేదు. మరి, మీలాంటి దోస ప్రియుల కోసం మేం మరో కొత్త రెసిపీని తీసుకొచ్చాం. ఇది రుచికరమైనది, ఆరోగ్యకరమైనది కూడా.. ఎర్ర కందిపప్పు పేరు వినే ఉంటారు కదా. అదేనండీ, కొన్ని ఏరియాల్లో మైసూర్ పప్పు అని పిలుస్తారు. దీనితో దోసలు వేస్తే కరకరలాడుతూ క్రిస్పీగా అనిపించడంతో పాటు రుచికరంగా ఉంటాయట. మరి ఆ రెసిపీ తెలుసుకుని మీరూ ట్రై చేయాలనుకుంటున్నారా!