మ్యాన్ ఆఫ్ మాసెస్ ‘ఎన్టీఆర్'(Ntr)అప్ కమింగ్ మూవీ ‘వార్ 2′(War 2)బాలీవుడ్ స్టార్ హీరో ‘హృతిక్ రోషన్'(Hrithik Roshan)తో కలిసి ‘ఎన్టీఆర్’ ఫస్ట్ టైం చేస్తున్న ఈ బాలీవుడ్ మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి అయాన్ ముఖర్జీ(Ayan Mukerji)దర్శకుడు కాగా,దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, మొహొబ్బతే, రబ్ నే బనాదీ జోడీ, బేఫికర్ వంటి పలు హిట్ చిత్రాలని నిర్మించిన యష్ రాజ్ ఫిలిమ్స్(Yash Raj Films)నిర్మిస్తుంది.
ఈ మూవీకి స్టార్ రైటర్ అబ్బాస్(Abbas)మాటల్ని అందించాడు.రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ‘వార్ 2 ‘ షూటింగ్ దాదాపుగా పూర్తవ్వడంతో అగస్ట్ 25 న విడుదలయ్యే అవకాశం ఉంది.ఆ రోజు హృతిక్,ఎన్టీఆర్ లని థియేటర్స్ లో కలుద్దాం అని చెప్పాడు.చాలా రోజుల నుంచి ‘వార్ 2 ‘ఇండిపెండెన్స్ డే కానుకగా అగస్ట్ 14 న విడుదల అవుతుందనే మాటలు వినిపిస్తు వచ్చాయి.మేకర్స్ అయితే రిలీజ్ డేట్ ని అధికారకంగా ప్రకటించలేదు.అసలు ఇంతవరకు సినిమా నుంచి ఎలాంటి పోస్టర్ కానీ,లుక్ కానీ రిలీజ్ కూడా చెయ్యలేదు.అలాంటిది ఇప్పుడు అబ్బాస్ చెప్పిన మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ని తీసుకొస్తున్నాయి.
ఇక ఎన్టీఆర్ ఈ మూవీలో ‘రా ఏజెంట్’ గా చేస్తున్నాడనే వార్తలు బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.2019 లో వచ్చిన వార్ మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది.