ఉద్యోగి పట్ల అనుచితంగా ప్రవర్తించిన బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని, ఆయనను పదవి నుంచి తొలగించాలని ఉద్యోగులు డిమాండ్‍ చేస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, విజిలెన్స్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని అధికారులు తెలిపారని ఉద్యోగ సంఘం నాయకులు అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. టీటీడీ ఉద్యోగులతో అన్నమయ్య భవన్‌లో ఈవో శ్యామలరావు, బోర్డు సభ్యులు నరేష్‌ కుమార్‌, భాను ప్రకాశ్‌రెడ్డి సమావేశమై చర్చించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here