అగ్రి ఇన్‌పుట్ పరిశ్రమలో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించేందుకు జాతీయ పురు మందుల సంఘాల ప్రతినిధులు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. డాక్టర్ ఆర్జీ అగర్వాల్(ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్), రమేశ్ కైలాసం(కోర్టేవా), బి.శ్రీనివాస్(బేయర్), దుగేశ్ చంద్ర(క్రాప్‌లైన్ ఇండియా), కల్యాణ్ గోస్వామి(ఏసీఫ్ఐ) నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంత్రిని కలిసింది. వ్యవసాయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందంచేందుకు పరిశ్రమ, ప్రభుత్వ సహకారాన్ని బలపరిచే విధంగా చర్చలు జరిగాయి.