రూ.755తో రూ.15 లక్షల కవరేజీ
బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యంలో మరో ప్రమాద బీమా కూడా ఉంది. సంవత్సరానికి కేవలం రూ.755 ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.15 లక్షల బీమా కవరేజీని పొందుతారు. పాలసీదారుడు ప్రమాదంలో మరణిస్తే, నామినీకి రూ. 15 లక్షలు లభిస్తాయి. శాశ్వత వైకల్యం, పాక్షిక వైకల్యానికి రూ. 15 లక్షలు అందుకోవచ్చు. ఆసుపత్రిలో వైద్య ఖర్చుల కోసం రూ.1 లక్ష, సాధారణ చికిత్స కోసం రోజుకు రూ.1000 అందిస్తారు. కాలు లేదా చేయి విరిగితే రూ.25,000 వరకు పరిహారం అందుకోవచ్చు. పిల్లల ఉన్నత విద్య, వివాహాలకు రూ. లక్ష వరకు అందిస్తారు. .