జెన్ 3 ప్లాట్‌ఫామ్‌తో కూడిన ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను త్వరలోనే ప్రారంభించాలని ప్రణాళికలు రచిస్తోంది ఓలా ఎలక్ట్రిక్. అంతేకాదు బెంగళూరులో ఈ ఈ-స్కూటర్ తాజాగా దర్శనమిచ్చింది. ఈ మోడల్ అఫార్డిబుల్ ధరలో మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తుందని సంస్థ చెబుతోంది. ఈ ఎస్1 ఎక్స్ ప్లస్.. ఎస్1 ప్రో, ఎస్1 ఎక్స్ మధ్యలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..