Stock market crash: స్టాక్ మార్కెట్ మదుపర్లలో వణుకు పుట్టిస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్లో 85,978.25 పాయింట్ల గరిష్టానికి చేరిన సెన్సెక్స్.. సుమారు 5 నెలల కాలంలో 10 వేల పాయింట్లు నష్టపోయింది. ఇందుకు ప్రధాన కారణం 2024 అక్టోబర్ నుంచి ఎఫ్ఐఐలు పెద్ద ఎత్తున అమ్మకాలకు పాల్పడడమేనని నిపుణులు చెబుతున్నారు.