Taj Banjara Seize: హైదరాబాద్‌లో ప్రముఖ హోటల్ తాజ్ బంజారాాను జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. రెండేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించక పోవడం, నోటీసులకు స్పందించక పోవడంతో తాజ్ బంజారా హోటల్‌ను సీజ్ చేశారు. జీవీకే గ్రూప్, తాజ్ హోటల్స్ భాగస్వామ్యంలో ఈ హోటల్ నడిచేది. జీవీకే గ్రూప్ నష్టాల్లోకి రావడంతో పాటు హోటల్ నిర్వహణ ఒప్పందాల గడువు ముగియడంతో నిర్వహణలో సమస్యలు తలెత్తినట్టు తెలుస్తోంది.