కియా సైరోస్
ఈ కారు రూ. 8.99 లక్షల నుండి రూ. 17.80 లక్షల ఎక్స్-షోరూమ్ ధరల రేంజ్‌లో అందుబాటులో ఉన్నాయి. 5 సీట్ల ఆప్షన్స్‌తో ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి ఇది 465 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. ఈ కియా సైరోస్ ఎస్‌యూవీ 1-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో లభిస్తుంది. ఇది లీటరుకు 17.65 నుండి 20.75 కి.మీ. మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇది స్పార్కింగ్ సిల్వర్, గ్రావిటీ గ్రే, ఇంపీరియల్ బ్లూ, ఇంటెన్స్ రెడ్, ప్యూటర్ ఆలివ్, అరోరా బ్లాక్ పెర్ల్ వంటి వివిధ కలర్స్‌లో కూడా దొరుకుతుంది.