ఐసీసీ టోర్నీ వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రపంచం మొత్తం ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కోసమే ఎదురు చూస్తోంది. 2008 నుంచి భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో రెండు జట్లు నేరుగా సిరీస్ ఆడట్లేవు. ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ లో ఇప్పటివరకూ ఈ చిరకాల ప్రత్యర్థులు అయిదు మ్యాచ్ లు ఆడగా.. పాక్ 3, భారత్ 2 గెలిచింది. ఈ సారి మ్యాచ్ గెలిచి లెక్క సమం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది.