బీబీసీ చేసిన తప్పు ఇదే..
బిబిసి చట్టాన్ని ఎలా ఉల్లంఘించిందనే వివరాలను ఒక ఈడీ అధికారి వెల్లడించారు.”సెప్టెంబర్ 18, 2019 న, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. ‘‘డిజిటల్ మీడియాకు 26% ఎఫ్డిఐ పరిమితిని భారత ప్రభుత్వం నిర్దేశించింది. అయినప్పటికీ, 100% ఎఫ్డీఐ కంపెనీగా కొనసాగుతున్న బీబీసీ భారత్ లో తమ ఎఫ్డీఐ పరిమితిని 26 శాతానికి తగ్గించలేదు. అదే 100% ఎఫ్డీఐ తో బీబీసీ డబ్ల్యుఎస్ ఇండియా, డిజిటల్ మీడియా ద్వారా వార్తలు, కరెంట్ అఫైర్స్ ను అప్లోడ్ / స్ట్రీమింగ్ చేసింది. ఇది భారత ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమే’’ అని వివరించారు. దీనిపై వివరణ కోసం హెచ్ టీ బీబీసీని సంప్రదించినా ఎలాంటి స్పందన రాలేదు. బీబీసీ కంపెనీ అధికారులకు సహకరిస్తూనే ఉంటుందని, వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్లు బీబీసీ ప్రతినిధి 2023 ఫిబ్రవరిలో తెలిపారు.