ఇనుప కడాయిలో నిమ్మకాయతో కూడిన ఆహారాలను వండకండి
ముందుగా చెప్పుకున్నట్లు ఆమ్ల స్వభావం ఉన్న కూరగాయలను వండకూడదు. అందులో మొదటిది నిమ్మకాయ, ఇనుప కడాయి లేదా పాన్లో ఎప్పటికీ నిమ్మకాయతో కూడిన వంటకాలను వండకూడదు. నిమ్మకాయల్లో ఉండే ఆమ్ల స్వభావం ఇనుప కళాయిలో వండినప్పుడు, ఇది ఆహారం రంగు, రుచిని మారుస్తుంది. దీని వల్ల ఆహారంలో చేదు వస్తుంది. కాబట్టి, మీరు ఇనుప కడాయిలో ఏదైనా వంటకం తయారు చేస్తున్నట్లయితే, దానిలో నిమ్మకాయను కలపడం మానుకోండి.