తుల రాశి
విద్యార్థులు, కళాకారులకు అనుకూలం. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వివాహాది శుభకార్యాలలో అందరి సహకారం లభిస్తుంది. కొత్త దుస్తులు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. తీర్ధయాత్రలకు వెళ్లే ఆలోచన చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చుల నియంత్రణ అవసరం. నూతన పెట్టుబడుల ఆలోచన పక్కన పెట్టండి. శ్రమ పెరుగుతుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.