నారా లోకేశ్ ఏమన్నారంటే?
గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షపై వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. రోస్టర్ విధానంపై తప్పులు సరిచేశాక గ్రూప్ 2 నిర్వహించాలని అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. విశాఖపట్నం, కాకినాడలో పెద్ద ఎత్తున అభ్యర్థులు నిరసన చేపట్టారు. దీంతో ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన.. గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై న్యాయ బృందంతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామన్నారు. గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన, వారి ఆవేదనలను అర్థం చేసుకున్నామన్నారు. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి తనకు చాలా విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు.