ఇద్దరికీ రిమాండ్..
రఘును టూ టౌన్ పోలీసుస్టేషన్‌కు రప్పించి, విచారణ చేపట్టారు. షేక్ మహ్మద్ సోయల్ రూపొందించిన క్యూర్ కోడ్‌ను రఘు కొనుగోలు చేసి.. దాని ద్వారా విద్యార్థిని ఫోటోలను, వీడియోలను సేకరించాడు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వాటికి సంబంధించిన లింక్‌లు అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకున్నట్లు రఘు పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు. దీంతో ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్టు చేసినట్లు శ్రీకాకుళం టూ టౌన్ సీఐ ఈశ్వరరావు తెలిపారు. నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరిచామని.. న్యాయమూర్తి రిమాండ్ విధించారని చెప్పారు.