పాలీసెట్‌-2025 ప‌రీక్ష‌ల నిర్వహణ‌కు రాష్ట్రంలోని 69 స‌మ‌న్వయ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. అలాగే ప‌రీక్షకు 1,50,000 మంది విద్యార్థులు హాజర‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ మేర‌కు విద్యా శాఖ కార్యద‌ర్శి కోన శ‌శిధ‌ర్ జీవో నెంబ‌ర్ 35ను విడుద‌ల చేశారు. అప్లికేష‌న్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థుల‌కు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల‌కు రూ.100గా నిర్ణయించారు. ఈ మేర‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్యలు తీసుకోవాల‌ని సాంకేతిక విద్యా శాఖ‌ను ఆదేశించారు. ప‌రీక్షను ఏప్రిల్ 30న ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు నిర్వహించ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here