యువ సామ్రాట్ నాగచైతన్య(Naga Chaitanya)రీసెంట్ గా ‘తండేల్'(Thandel)తో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.కెరీర్ లో ఫస్ట్ టైం 100 కోట్ల మార్కుని అందుకొని అక్కినేని అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాడు.తన నెక్స్ట్ మూవీని ‘విరూపాక్ష'(Virupaksha)ఫేమ్ కార్తీక్ దండు(Karthik Dandu)డైరెక్షన్ లో చెయ్యబోతున్నాడు.ఈ సినిమాపై కూడా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
చైతు పర్సనల్ విషయానికి వస్తే గత ఏడాది డిసెంబర్ 4 న ప్రముఖ హీరోయిన్ ‘శోభిత ధూళిపాళ్ల'(Sobhita Dhulipala)ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి హైదరాబాద్ లోని ‘సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్'(st judes india chaildcare center)ని సందర్శించి,అందులో క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న చిన్నారుల కలిసి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.వాళ్ళతో సరదాగా ముచ్చటించడంతో పాటు, పిల్లలతో ఫోటోలు కూడా దిగి,కాన్సర్ విషయంలో అధైర్య పడవద్దని దైర్యం చెప్పారు. అనంతరం చైల్డ్ కేర్ ప్రతినిధులతో మాట్లాడి పిల్లల ఆరోగ్యం గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో పలువురు నెటిజెన్స్ చైతు,శోభితల మంచి మనసుని అభినందిస్తు కామెంట్స్ చేస్తున్నారు.