ఆహారం జీర్ణం కావడానికి పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉంటాయి. అవి తగ్గిపోతే జీర్ణక్రియ మాత్రమే కాదు, శరీరంలో ఇతర సమస్యలు కూడా వస్తాయి. శరీరంలో చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా ఉంటేనే సమతూకంగా ఉంటుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెంచాలని వైద్యులు అందుకే సూచిస్తుంటారు. నిజానికి, పేగుల్లో లక్షలాది బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్‌లు ఉంటాయి. అవి గట్ మైక్రోబయోమ్‌ను ఏర్పరుస్తాయి. ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ జీర్ణక్రియతో పాటు రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యానికి కూడా అవసరం.