ఫూల్ మఖానాలో పోషకాలు
పూల్ మఖానాలో మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం, భాస్వరం, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. కేలరీలు కొవ్వు తక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని ఆరోగ్యకరమైన స్నాక్ గా చెప్పుకుంటారు. కొలెస్ట్రాల్, సోడియం కూడా ఎంతో తక్కువగా ఉంటాయి. కాబట్టి గుండె ఆరోగ్యానికి ఫూల్ మఖానా ఎంతో మేలు చేస్తుంది. ఎముకలు, దంతాలను బలోపేతం చేయడానికి ఇది సహాయపడుతుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. కాబట్టి డయాబెటిస్ రోగులు సంతోషంగా వీటిని సంతృప్తిగా తినవచ్చు. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మంపై ముడతలు, గీతలు రాకుండా అడ్డుకుంటాయి. అకాల వృద్ధాప్యాన్ని అడ్డుకుంటాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. కాబట్టి చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు కూడా ఫూల్ మఖానా ఉపయోగపడుతుంది.