ssmb 29పై మహేష్(Mahesh)రాజమౌళి(Rajamouli)అభిమానులతో పాటు,ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra)హీరోయిన్ గా చేస్తుంది.కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ఎలాంటి హడావిడి లేకుండా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా,మొదటి షెడ్యూల్ ని కంప్లీట్
చేసుకుందనే టాక్ వినబడుతుంది.
ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన వివరాలన్నీ పంచుకోవడానికి చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేయనుందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.ఇంతవరకు SSMB29 నుంచి అధికారంగా ఒక పోస్టర్ గాని,మహేష్ లుక్ గాని బయటకి రాలేదు.అసలు మహేష్,రాజమౌళి కూడా మూవీ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు.దీంతో ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి మూవీ అప్ డేట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.ఈ క్రమంలో SSMB29 టీం మీడియా సమావేశం ఏర్పాటు చేయనుందనే వార్తలు రావడంతో ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ వచ్చినట్లయ్యింది.ప్రెస్ మీట్ లో మహేష్,రాజమౌళి,ప్రియాంకచోప్రా మూవీ గురించి ఏం చెప్తారనే క్యూరియాసిటీ కూడా అందరిలో ఉంది.
ఇక మూవీ టీం తమ రెండో షెడ్యూల్ కోసం ఆఫ్రికా వెళ్లడానికి కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.అక్కడే ఎక్కువ భాగం షూటింగ్ జరుపుతారని, అందుకే ఆఫ్రికా వెళ్ళటానికి ముందు మీడియా ముందుకు రావాలని భావిస్తున్నట్లు సమాచారం.పలువురు భారతీయ నటులతో పాటు విదేశీ నటులు కూడా నటించబోతున్న ఈ మూవీలో మరో హీరోయిన్ కూడా చేయనుందనే వార్తలు కూడా వస్తున్నాయి.