కొన్ని సంవత్సరాలుగా పెద్ద కంపెనీలు వరుసగా ఐపీఓలకు వస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి కంపెనీలు తమ ఐపీఓలను ప్రారంభించాయి. దీనికి ప్రధాన కారణం వృద్ధి అవకాశాలు, పెట్టుబడిదారులలో ఉన్న భారీ ఐపీఓ క్రేజ్. రాబోయే రెండేళ్లలో చాలా కంపెనీలు ఐపీఓలతో మార్కెట్‌లోకి రావచ్చని కొంతమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. నివేశాయ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్(స్మాల్ కేస్ మేనేజర్) ఇటీవలి నివేదిక ప్రకారం.. టెలికాం, టెక్నాలజీ, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, సిమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగాలలో రికార్డు సంఖ్యలో పబ్లిక్ ఆఫర్లు అంచనా వేశారు. రాబోయే రోజుల్లో 7 ప్రధాన కంపెనీలు ఐపీఓకు రానున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ రాసింది.