పక్కాగా రెక్కీ నిర్వహించి..
భూపాలపల్లి పట్టణంలో ప్రస్తుతం కాలనీలు, రహదారుల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. దీంతో పక్కాగా రెక్కీ నిర్వహించి, సీసీ కెమెరాలు లేని టీబీజీకేఎస్ కార్యాలయం సమీపంలోని ప్రాంతాన్ని హత్యకు ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని నిందితులు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. రాజలింగమూర్తిపై గతంలో రాంనగర్ కాలనీలో, భూపాలపల్లి పట్ణణంలో కొందరు హత్యాయత్నం చేశారని ఆయన భార్య ఫిర్యాదులో స్పష్టం చేశారు.