మేడ్చర్ నేషనల్ హైవే 44పై ఆదివారం(ఫిబ్రవరి 16) మధ్యాహ్నం దారుణం జరిగింది. ఓ వ్యక్తిని అంతా చూస్తుండగానే కొందరు యువకులు వెంటాడి పొడిచి చంపారు. కింద పడిపోయిన వ్యక్తి ప్రాణాలు పోయే వరకు కత్తులతో పొడుస్తూనే ఉన్నారు. ఈ దారుణాన్ని ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. నిందితులను మృతుడి సొంత తమ్ముడు, చిన్నాన్న కుమారుడిగా గుర్తించారు. ఇంట్లో నుంచి వెంట పడి, కత్తులతో పొడిచి చంపడం చూసిన వారిని భీతావహుల్ని చేసింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేటకు చెందిన గుగు లోత్ గన్యా మేడ్చల్ ఆర్టీసీ డిపోలో బస్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. గన్యాకు ఇద్దరు కుమారులు ఉమేశ్, రాకేశ్‌తో పాటు ఒక కుమార్తె హరిణి ఉన్నారు.