సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలోని న్యాక్((నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్)) శిక్షణ కేంద్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యేక శిక్షణ ప్రారంభమైంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, సిమెంట్ ఇటుకల తయారీ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ప్రారంభించారు.