ఇండియన్ ఆర్మీ, రెస్క్యూ టీమ్ సహాయాన్ని కోరినట్లు మంత్రులు తెలిపారు. టన్నెల్ బోరింగ్ మిషన్‌తో పని మొదలు పెట్టగా మట్టి, నీరు వచ్చి చేరుతుందన్నారు. 8 మీటర్ల మేరకు మట్టి, బురద చేరిందని పేర్కొన్నారు. అయితే టన్నెల్ ప్రమాదంలో ఇద్దరు ఇంజినీర్లు, 6గురు జయప్రకాష్ అసోషియేట్స్ ఉద్యోగులు ఉన్నట్లుగా సమాచారం. శ్రీశైలం ఎడమవైపు సొరంగ పనులు జరుగుతుండగా, 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది.