Yadagirigutta Temple Vimana Gopuram : స్వర్ణ కాంతుల్లో యాదగిరిగుట్ట విమాన గోపురం మెరిసిపోనుంది. విమాన గోపురం స్వర్ణ తాపడం పనులు పూర్తి కాగా.. మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు మెుదలయ్యాయి. ఫిబ్రవరి 23వ తేదీన స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ఠామహోత్సవం జరగనుంది. ఇందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు.