‘హనుమాన్'(Hanuman)మూవీతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డమ్ సంపాదించిన హీరో తేజ సజ్జ(Teja Sajja)గత  ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్’ పెద్ద హీరోల సినిమాలని సైతం తట్టుకొని  ఇండియా వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్ళని సాధించింది.ఈ క్రమంలో  తేజసజ్జ అప్ కమింగ్ మూవీ ‘మిరాయ్'(Mirai)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టిజి విశ్వప్రసాద్(Tg Viswaprasad)నిర్మిస్తున్న’మిరాయ్’ కి ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని(Karthik Gattamneni)దర్శకత్వం వహించాడు.ఏప్రిల్ రిలీజ్ కాబోతుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.కానీ ఇప్పుడు అగస్ట్ 1 న రిలీజ్ కాబోతుందని చిత్ర బృందం అధికారకంగా ప్రకటించింది.సూపర్ యోధ యొక్క వెలుగు ప్రపంచవ్యాప్తంగా అగస్ట్ 1 న థియేటర్లలో ప్రారంభమవుతుంది.పెద్ద స్క్రీన్‌పై ఉత్కంఠభరితమైన యాక్షన్ అడ్వెంచర్‌ను చూసేందుకు సిద్ధంగా ఉండండంటు కూడా చిత్ర బృందం తెలిపింది.

ప్రముఖ హీరో మంచు మనోజ్(Manchu Manoj)విలన్ గా చేస్తుండటంతో ఈ ప్రాజెక్టు ఒక ప్రత్యేకతని కూడా సంతరించుకుంది. యాక్షన్, అడ్వెంచర్,ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ‘మిరాయ్’ అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కతుండగా రితికా నాయక్(Ritika Nayak)హీరోయిన్ గా చేస్తుంది. తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ,హిందీ,మరాఠి, బెంగాలీ ఇలా పాన్ ఇండియాలోని అన్ని భాషల్లో విడుదల కానుంది.

 


 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here