ఏపీలో 1 కోటి 48 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిల్లో 90 లక్షల కార్డులు కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆహార భద్రత చట్టం కింద జారీ చేసినవి. ఈ కార్డులకు మాత్రమే కేంద్రం ఉచితంగా బియ్యం, తక్కువ ధరకు కందిపప్పు, పంచదార ఇతర సరుకులు అందిస్తుంది. మిగిలిన కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది.