1999లో ప్రేమకథ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన సుమంత్ ఎన్నో వైవిధ్య సినిమాల్లో నటించి అలరించాడు. ప్రేమకథ తర్వాత యువకుడు, పెళ్లి సంబంధం, రామా చిలకమ్మ, నాగార్జునతో కలిసి స్నేహమంటే ఇదేరా వంటి అనేక సినిమాలతో ఆకట్టుకున్నాడు సుమంత్. అయితే కెరీర్లో సోలో హీరోగా పెద్ద సక్సెస్ అందుకోలేకపోయాడు. మరి ఇప్పుడు రాబోతున్న ఈ అనగనగా మూవీ ఏం చేయబోతోందో చూడాలి.