ప్రమాదం జరిగిన స్థలాన్ని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం పరిశీలించారు.
అమెరికాకు చెందిన సైట్ ప్రాజెక్ట్ మేనేజర్‌తో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ… కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత మరియు వెనుకబడిన ప్రాంతాలకు 30 టిఎంసిల సాగునీటిని సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యమన్నారు. దాదాపు 44 కి.మీ సొరంగమార్గం ఉంటుందన్నారు.
(HT_PRINT)