సమన్వయంతో సాగుతున్నాం..
‘ధీరుడు ఎప్పుడు బరిగేసి కొట్లాడుతాడు. కుట్రదారులు, గెలవలేనివారు, సత్తా లేనివారు, ప్రజాక్షేత్రంలో పలుకుబడి లేని వారు మాత్రమే ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజి రెడ్డిని, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమరయ్యను గెలిపించాలని గత నెల రోజులుగా బీజేపీ ప్రచారం చేస్తుంది. పార్టీ యంత్రాంగం, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ వ్యవస్థ అందరూ సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యారు. సమన్వయంతో బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారు’ అని రాజేందర్ వివరించారు.