ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోతే, మళ్లీ ఇడ్లీనే తినాలా అని బోరింగ్ గా ఫీలవుతున్నారా? ఇడ్లీ పునుగులు, రొట్టెలు కూడా రొటీన్ అనుకుంటున్నారా? అయితే రండి. ఈ సారి కొత్తగా ఇడ్లీ పిండితో తియ్యటి, కమ్మటి కొబ్బరి రొట్టెలు తయారుచేసుకుందాం. మీ నానమ్మ లేదా అమ్మమ్మ గారింట్లో తిన్న రుచిని గుర్తు చేసుకుందాం. వీటిని స్కూల్ నుంచి వచ్చిన మీ పిల్లలకు స్నాక్‌గా పెట్టారంటే, వాళ్లు చాలా హ్యాపీగా ఫీలవుతారు. పెద్దలు కూడా వదలకుండా తినేస్తారు.