కేజీఎఫ్ ఫిల్మ్ సిరీస్ తో పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు పొందిన కన్నడ స్టార్ యశ్.. వేగంగా సినిమాలు చేయకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ (Toxic) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నాడు యశ్. అందుకే కన్నడతో పాటు ఇంగ్లీష్ లోనూ సమాంతరంగా ఈ సినిమాను షూట్ చేస్తున్నారు. 

 

ఇలా కన్నడతో పాటుగా ఇంగ్లీష్‌లోనూ సమాంతరంగా చిత్రీకరిస్తున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా టాక్సిక్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో సహా పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లోకి డబ్ కానుంది.

 

గీతూ మోహన్‌దాస్ మాట్లాడుతూ.. “విభిన్న భాషా, సాంస్కృతిక నేపథ్యాలలో రాబోతోన్న టాక్సిక్ మూవీని అన్ని భాషల, ప్రాంతాల ప్రేక్షకులు ఆస్వాధించేలా రూపొందిస్తున్నాం. అందుకే కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రం అన్ని సరిహద్దుల్ని చెరిపివేస్తుందని భావిస్తున్నాం.” అని అన్నారు.

 

నిర్మాత వెంకట్ కె. నారాయణ మాట్లాడుతూ.. “టాక్సిక్ విషయంలో మా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించే చిత్రంగా టాక్సిక్‌ను రూపొందిస్తున్నాం. మొదటి నుంచీ ఈ కథపై మాకు ఎంతో నమ్మకం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా ప్రపంచ వేదికపై భారతీయ సినిమా ప్రతిభను కూడా ప్రదర్శించేలా టాక్సిక్ రాబోతోంది” అని అన్నారు.

 

KVN ప్రొడక్షన్స్, యష్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ నారాయణ టాక్సిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్ విక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీలకు పని చేసిన జేజే పెర్రీ యాక్షన్ డైరెక్టర్ వ్యవహరిస్తున్నారు. డ్యూన్ పార్ట్ 2 విజువల్ ఎఫెక్ట్స్‌కి గానూ బాఫ్టా ఫిల్మ్ అవార్డుని అందుకున్న డినెగ్ ఈ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్‌ను అందిస్తున్నారు.

 

ఈ టాక్సిక్ చిత్రీకరణ గత ఏడాది ఆగష్టులో ప్రారంభమైంది. యష్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాల్లో ఒకటిగా టాక్సిక్ నిలవనుంది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here